*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మిరియాల ప్రీతం*
*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మిరియాల ప్రీతం* ///
*చందానగర్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 31 –:*
చందానగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ లోని ‘గడప గడప’ ప్రచార కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావు, టిపిసిసి జనరల్‌సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో కలిసి ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ… “జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఓటరు పాలుపంచుకోవాలి. అందుకే అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రతి ఓటు విలువైనదని, అభివృద్ధికి మద్దతుగా ఆశీర్వాదాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలని కోరుతున్నాము,” అన్నారు.
ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలకు అభివృద్ధి పనుల ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు పార్టీలో భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని తెలిపారు. అభివృద్ధి పథంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నదని, ప్రజాప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other