*50 కి పైగా బారికేడ్లను బహూకరించిన కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు*

0
156

*50 కి పైగా బారికేడ్లను బహూకరించిన కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు* /// 

*ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం* /// 

*ముఖ్య అతిధిగా హాజరైన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్* ///

 

*కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) , అక్టోబర్ 31–:* కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసుల విభాగానికి కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు 50కి పైగా బారికేడ్లను అందజేసింది. శుక్రవారం కొండారెడ్డి బురుజు వద్ద కిమ్స్ హాస్పిటల్స్‌ , కర్నూలు ... కర్నూలు ట్రాఫిక్ పోలీస్‌ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమంలో ఈ బారికేడ్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కి, కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు సీఓఓ డా. శేపూరి సునీల్ అందజేశారు. 

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు పట్టణం మీదుగా, జాతీయ రహదారి వెళ్తుంది, అలాగే పట్టణంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, ప్రమాదాలను తగ్గించడానికి బారికేడ్లు ఎంతగానే ఉపయోగపడతాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ బారికేడ్లను అందించినందుకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యంకు అభినందనలు తెలియజేశారు. ట్రాఫిక్ సి ఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో తయారుచేసిన ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ మోడల్ ను ఆయన ప్రశంసించారు. 

 

అనంతరం కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు సీఓఓ డా. సునీల్ శేపూరి మాట్లాడుతూ ... సమాజ సేవలో భాగంగా , ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పోలీస్ విభాగంతో కలిసి ట్రాఫిక్ పోలీసులతో అవగాహన కార్యక్రమం కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. 

Search
Categories
Read More
Education
Master of Business Administration - Operations Management
      An online master\'s degree in operations management teaches you how...
By IIBMS ANDHRAPRADESH 2025-09-15 05:48:09 0 934
Education
Bachelor of Business Administration in Finance
   Earn your Online Bachelor of Business Administration (BBA) in Finance and lay a...
By IIBMS ANDHRAPRADESH 2025-09-02 09:51:05 0 1K
Food & Recipes
Sunshine on a Plate: Spring Vegetable Tagliatelle with Lemon-Chive Sauce
Hello, spring enthusiasts! 🌱 As soon as the farmer's markets fill up with vibrant greens, I...
By Seshta Fusion Foods & Beverages 2025-10-28 17:04:42 0 142
Health
Food for fat burning and type 2 diabetes
That's a great goal! Focusing on whole, unprocessed vegetarian foods is a fantastic way to...
By Seshta Integrated Medicine Research Centre 2025-04-20 03:29:36 0 3K
Education
Doctorate in Management Studies
     For working professionals who want to advance in their careers, our online...
By IIBMS ANDHRAPRADESH 2025-09-21 06:22:46 0 443