*50 కి పైగా బారికేడ్లను బహూకరించిన కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు*
*50 కి పైగా బారికేడ్లను బహూకరించిన కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు* ///
*ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం* ///
*ముఖ్య అతిధిగా హాజరైన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్* ///
*కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) , అక్టోబర్ 31–:* కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసుల విభాగానికి కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు 50కి పైగా బారికేడ్లను అందజేసింది. శుక్రవారం కొండారెడ్డి బురుజు వద్ద కిమ్స్ హాస్పిటల్స్ , కర్నూలు ... కర్నూలు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమంలో ఈ బారికేడ్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కి, కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు సీఓఓ డా. శేపూరి సునీల్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు పట్టణం మీదుగా, జాతీయ రహదారి వెళ్తుంది, అలాగే పట్టణంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, ప్రమాదాలను తగ్గించడానికి బారికేడ్లు ఎంతగానే ఉపయోగపడతాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ బారికేడ్లను అందించినందుకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యంకు అభినందనలు తెలియజేశారు. ట్రాఫిక్ సి ఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో తయారుచేసిన ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ మోడల్ ను ఆయన ప్రశంసించారు.
అనంతరం కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు సీఓఓ డా. సునీల్ శేపూరి మాట్లాడుతూ ... సమాజ సేవలో భాగంగా , ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పోలీస్ విభాగంతో కలిసి ట్రాఫిక్ పోలీసులతో అవగాహన కార్యక్రమం కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other