*జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు*
*జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు*
*జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు* /// *కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం) –:* కర్నూలు ప్రోహిబిషన్ .. డిప్యూటీ కమిషనర్ వారి కార్యాలయంలో జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు జిల్లాల అధికారులు .. సీఐ లు హాజరయ్యారు. సమావేశం లో నవోదయం 2.0 లో భాగంగా నాటుసారా నిర్మూలన చేయడం ... ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు నిర్వహించడం, అక్రమ మద్యం అరికట్టడం .. అనధికారగా మద్యాన్ని నిర్మూలించడం పక్క రాష్ట్రాల మద్యం పై నిఘా ఉంచి వాటిని పూర్తిగా నిర్మూలించడం ... అనంతరం సురక్ష ఆప్ ద్వారా స్కానింగ్ ... ఎక్సైజ్ ఆప్ ద్వారా పర్యవేక్షణ చేయవలసినదిగా సమీక్ష సమావేశంలో అధికారులు వివరించడం జరిగింది. అంతేకాక మద్యం షాపు అన్నింటికీ పరిమిట్ రూముల లైసెన్స్ ఇవ్వడంతో పాటు ఆర్ ఈటీ సక్రమంగా కట్టినది లేనిది పర్యవేక్షించి రిపోర్టు చేయవలసినదిగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి శ్రీదేవి , అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిoటెండెంట్ వి రాముడు , రామకృష్ణారెడ్డి , రాజశేఖర్ గౌడ్ .. ఆయా స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు.
0 Comments
0 Shares
12 Views
0 Reviews