*రజక ఆకాంక్ష సభ-3 ను విజయవంతం చేయండి*

0
330

*రజక ఆకాంక్ష సభ-3 ను విజయవంతం చేయండి* ///

*నంద్యాల రూరల్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 23 –:*

ఆంధ్రప్రదేశ్ రజక సమాజ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రజక ఆకాంక్ష సభలు” ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఈ సభలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే.

 

ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, నంద్యాల జిల్లా రజక సేవా సంఘం గౌరవ అధ్యక్షులు జూటూరు వెంకటేశ్వర్లు, రైల్వే శ్రీనివాసులు, అధ్యక్షులు కొర్రపోలురు నాగరాజు , ప్రధాన కార్యదర్శి కౌలురు శ్రీనివాసులు,సుకుమాంబ కుమారి మాట్లాడుతూ అదే విధంగా, రాబోయే అక్టోబర్ 26, 2025 (ఆదివారం) న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో “రజక ఆకాంక్ష సభ – 3” రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ .. డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందనీ తెలిపారు. రజక సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్న నంద్యాల జిల్లా రజక సేవా సంఘం తరఫున, రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా రజక సంఘ నాయకులు, సోదరులు, సోదరీమణులను ఈ సభకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుమన్నారు.రజక సమాజ ఐక్యతకు, హక్కుల సాధనకు ఈ సభ ఎంతో కీలకమని భావిస్తూ, అందరు రజక సంఘ నాయకులు, సభ్యులు, యువతీ యువకులు సమష్టిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బాల రంగయ్య, మంజీరా సీడ్స్ మద్దిలేటి, మల్లయ్య, ఆంజనేయులు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Education
Master of Business Administration - Banking & Insurance
     For working individuals who want to advance in the financial services sector,...
By IIBMS ANDHRAPRADESH 2025-09-17 10:50:06 0 1K
News
*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ స్థాయి అవార్డు.*
*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ...
By Shalanna Shalanna 2025-10-30 10:46:09 0 131
News
*ఎక్మోపై భువ‌నేశ్వ‌ర్ నుంచి విశాఖ కిమ్స్ ఐకాన్ 500 కి.మీ. రోడ్డు ప్ర‌యాణం!* /// *భువ‌నేశ్వ‌ర్ నుంచి విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్ప‌త్రికి యువ‌కుడు*
*ఎక్మోపై భువ‌నేశ్వ‌ర్ నుంచి విశాఖ కిమ్స్ ఐకాన్ 500 కి.మీ. రోడ్డు ప్ర‌యాణం!* ///...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-30 10:42:16 0 110
News
*దొందూ.. దొందే..! అనే చందంగా .. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు*
*దొందూ.. దొందే..! అనే చందంగా .. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు* ///   ...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-30 11:27:30 0 105
Food & Recipes
🥜 Masala Peanut Chaat Recipe 🍅🧅
This recipe is quick, requires no cooking (aside from the peanuts), and is perfect for a light,...
By Seshta Fusion Foods & Beverages 2025-10-29 21:44:04 0 187