*దొందూ.. దొందే..! అనే చందంగా .. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు*
*దొందూ.. దొందే..! అనే చందంగా .. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు* ///
*అడుగడుగునా గుంతలతో..వర్షం నీటిలో గుంతలు కనిపించక నరకం చూపిస్తున్న రోడ్డు.* ///
*రూ.కోటికి పైగా ఆదాయం వస్తున్నా .. ఐదేళ్లుగా రోడ్డు వేయాలని స్పృహ లేని అధికారులు* ///
*కర్నూలు కార్పోరేషన్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 30 –:*
విష్ణు టౌన్ షిప్ తో పాటు పలు కాలనీలకు ఉపయోగపడే 60 అడుగుల రోడ్డుపై సిమెంట్ రోడ్డు నిర్మించాలని పాలకుల చుట్టూ తిరిగినా.. ఎవరు స్పందించలేదు. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు దొందు దొందే అనే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది ఆర్ చంద్రశేఖర్, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం ఆజాద్,కే మల్లికార్జున, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, మెకానికుల అసోసియేషన్ నాయకులు ఎస్ హైదర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధినిరసన బృందం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై పర్యటించి చేపలు పడుతూ నిరసన తెలిపారు. అనంతరం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పన్నుల రూపంలో ఏటా రూ.కోటి పైగా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తున్నా.. రోడ్డు వేయాలని స్పృహ అధికారులకు లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డుపై వెళ్లడమే తప్ప స్పందించడం లేదన్నారు. గత ప్రభుత్వం..ప్రస్తుత ప్రభుత్వం తో పాటు నగరపాలక సంస్థకు చెందిన పాలకవర్గం కూడా ఈ ప్రాంత అభివృద్ధి పై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. వర్షం నీరు నిలబడి గుంతలు కనిపించక లైట్లు వెలగక ప్రతిరోజు అనేకమంది కిందపడి లేచిపోతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉండడమే మేము చేసిన పాపమా? అని ప్రశ్నించారు. వృద్ధులు గర్భిణీ స్త్రీలు పక్క వీధి రోడ్ల మీదుగా నగరానికి చేరుకుంటున్నారని అన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విష్ణు టౌన్షిప్ లో సిమెంట్ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు మహమ్మద్ యూనూస్, ఎస్ రఘురామిరెడ్డి, ఎం ముస్తఫా,కె బ్రహ్మం, ఎస్ అన్వర్ భాష, ఎస్ సత్యనారాయణ, పివి మధుసూదన్ రావు, సివి వర్మ, ఈ లక్షణ గౌడు, కె బుచ్చే శ్వరరావు, ఏ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other