*కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు*

0
222

*కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు* /// 

*కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 25 –:*

(24.05.2025) శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయినటువంటి శివశంకర్ తో పాటు ఉన్న వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి అలియాస్ నాని గా గుర్తించాము. 

 

అతన్ని మేము పలు కోణాల్లో విచారించాము. ఎర్రిస్వామి .. బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరు కలిసి లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల కు బయలు దేరారు. ఎర్రిస్వామి ని వదలడానికి తుగ్గలికి బయలు దేరాడు. 

 

ఎర్రిస్వామిని వదలడానికి వెళ్ళిన పల్సర్ బైక్ మార్గం మధ్యంలో కియా షోరూం దగ్గర గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత 2.24 గంటలకు రూ. 300 పెట్రోల్ పట్టించుకుని బయలు దేరాడు.

 

బయలు దేరిన కొద్ది సేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్క్రిడ్ అయి రోడ్డు కు కుడి ప్రక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాడు .

 

బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

 

వెనుకాల ఉన్న ఎర్రిస్వామి అలియాస్ నాని చిన్న గాయాలతో బయట పడ్డాడు.

 

ప్రమాద ఘటన స్ధలం దగ్గర రోడ్డు మధ్యలో నుండి శివశంకర్ ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని అతను నిర్దార్ధించుకునే లోపే రోడ్డు పై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే సమయంలో అంతలోనే బైక్ ను బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్ళింది.

 

బస్సు క్రింద మంటలు రావడంతో అక్కడి నుండి ఎర్రిస్వామి అలియాస్ నాని బయపడి తన స్వంత ఊరైనా తుగ్గలి కి బయలు దేరి వెళ్ళిపోయాడు. 

 

ఈ ప్రమాద విషయం పై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు . 

 

తదుపరి విచారణ దర్యాప్తును కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వెల్లడించారు.

Search
Categories
Read More
Health
Abulia And Homeopathic Treatment
Since abulia frequently manifests as a residual symptom of other illnesses, there is a lack of...
By Seshta Integrated Medicine Research Centre 2025-03-27 16:02:11 0 2K
News
*పలు వివాహ గృహప్రవేశ శుభాకార్యాలకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*
*పలు వివాహ గృహప్రవేశ శుభాకార్యాలకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* ///    *పాల్గొన్న...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-31 16:11:37 0 139
Devotional
The Sovereign of the Seas: Exploring the Enigmatic God Varuna
In the vast and ancient pantheon of Hindu deities, few figures possess a more profound and...
By Aryavarta Media Network 2025-10-02 14:42:20 0 3K
Networking
Abrasive Tools Market Share Leading Brands Strengthen Presence with Advanced Abrasive Product Lines
As Per Market Research Future, the Abrasive Tools Market Share is characterized by a competitive...
By Mayuri Kathade 2025-11-25 09:33:27 0 266
Education
Master of Business Administration - Operations Management
      An online master\'s degree in operations management teaches you how...
By IIBMS ANDHRAPRADESH 2025-09-15 05:48:09 0 934