*విశ్వబ్రాహ్మణ ప్రతినిధుల విన్నపానికి .. సానుకూలంగా స్పందించిన టీటీడీ పాలకమండలి అధ్యక్షులు బి.ఆర్ నాయుడు*
*విశ్వబ్రాహ్మణ ప్రతినిధుల విన్నపానికి .. సానుకూలంగా స్పందించిన టీటీడీ పాలకమండలి అధ్యక్షులు బి.ఆర్ నాయుడు* /// *తిరుపతి ప్రతినిధి (నేటి గళం) –:* తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు) ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
కమ్మరి పార్వతమ్మ , బ్రహ్మశ్రీ ధనాలకోట శోభన్ బాబు , బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ జాతీయుల తరుపున
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల దేవస్థానము నుండి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలజ్ఞాన విరిచితులు, ఆగామీ సంఘసంస్కర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబ అమ్మవార్ల కళ్యాణోత్సవము .. శ్రీ ఈశ్వరి మాత అమ్మవారి ఆరాధన ఉత్సవము నందు పట్టు వస్త్రములు అన్ని లాంఛనములతో సమర్పించుటకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు వంశపారంపర్య ఆరాధ్య దైవము శ్రీ మహా విష్ణు స్వరూపమైనటువంటి శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ప్రవచనాలు మహిమలు జగత్తు మొత్తం తెలిసినవే..
1. వీరబ్రహ్మేంద్రస్వామి వారి దంపతుల కల్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినమున బ్రహ్మంగారి మఠం నందు అత్యంత వైభవముగా జరుపబడుతుంది. అలాగే ...
2. వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ స్వామి వారు సజీవ సమాధి చెంది నిష్టాగరిష్టులై వేంచేసి ఉన్న రోజు వారి ఆరాధన ఉత్సవం జరుగుతుంది.
3. శ్రీ స్వామివారి మనుమరాలు అయినటువంటి శ్రీ మాత ఈశ్వరి మాత ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ నవమి రోజున జరుపబడుతున్నాయి.
పై మూడు సందర్భాలలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సకల లాంఛనంతో పట్టు వస్త్రములను సమర్పించవలసినదిగా మిమ్ములను వినయపూర్వకముగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు ని ఈ యొక్క సుస్థిర నిర్ణయాన్ని తీసుకుని విశ్వబ్రాహ్మణ బంధువుల ఆత్మాభిమానాన్ని కాపాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ జాతీయుల అభిమానాన్ని సంపూర్తిగా పొందవలసినదిగా అత్యంత హృదయపూర్వకంగా వారు కోరటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి చరిత్రను మరియు విశ్వబ్రాహ్మణ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు ఒక మరుపురాని, మరిచిపోని గుర్తుగా కొన్ని తరాలపాటు ఈ రాష్ట్రంలో మీ యొక్క పాలకమండలి విశాల హృదయాన్ని ధార్మిక మరియు సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడినటువంటి విషయాన్ని మా విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం కీర్తిస్తుందని సవినియంగా తెలియజేసినాము. మేము కోరిన వెంటనే మా విన్నపాన్ని వినయ పూర్వకంగా విన్న అధ్యక్షులు బిఆర్ నాయుడు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీయొక్క విన్నపాన్ని పాలకమండలిలో ఆమోదింపజేసి తెలియజేస్తానని తెలిపారు. అందులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణుల అందరి తరుపున వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other