వాయుగుండం నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి :– జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

0
243

*వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి*

 

*వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి*

 

 

*కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు కలెక్టరేట్ రిపోర్టర్ (నేటి గళం), అక్టోబర్ 22: వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

 

 రిజర్వాయర్లు,చెరువులు, లోతట్టు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నదీతీర ప్రాంతాలను పరిశీలించి, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, తగిన నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వాగులు, వంకల వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న చోట వాహన రాకపోకలు నిలిపివేసి, ప్రజలను సురక్షితమైన ప్రత్యామ్నాయ రహదారులపైకి మళ్లించాలని తెలిపారు. విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు రైతులకు పంట నష్టం జరుగకుండా తగిన సలహాలు అందచేయాలని సూచించారు.

జిల్లా కేంద్రంలో, ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను తరలించేందుకు షెల్టర్ లను గుర్తించి, ఆహార పదార్థాలు అందించే విధంగా సిద్ధపడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 

 

 

Search
Categories
Read More
Education
Doctorate in Management Studies
     For working professionals who want to advance in their careers, our online...
By IIBMS ANDHRAPRADESH 2025-09-21 06:22:46 0 412
News
🚇 The Sanitary Superhighway: Singapore's Deep Tunnel Sewerage System (DTSS)
The production of NEWater, Singapore's ultra-clean reclaimed water, is an engineering miracle...
By Saikrishna 2025-11-05 12:54:07 0 75
Education
Executive Master of Business Administration - Agri Business-
     Professionals wishing to advance in the food and agriculture sectors are the...
By IIBMS ANDHRAPRADESH 2025-09-19 10:14:55 0 695
Education
Master of Business Administration - Business Analytics
An online MBA in corporate Analytics is intended to provide working professionals with the...
By IIBMS ANDHRAPRADESH 2025-09-15 05:28:14 0 878
Education
Bachelor of Business Administration in Finance and Accounting
   The goal of our online BBA in finance and accounting program is to give students a...
By IIBMS ANDHRAPRADESH 2025-09-10 18:38:45 0 1K