*కొనుగోలు కేంద్రం, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం కోసం మొక్కజొన్న రైతులు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా.*–:*ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.*
*కొనుగోలు కేంద్రం, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం కోసం మొక్కజొన్న రైతులు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా.*–:*ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.* ///
*ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 రూపాయలు వెంటనే అమలు చేయాలి.* ///
*అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.* ///
*అధిక వర్షం వల్ల పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు 40వేలు నష్టపరిహారం చెల్లించాలి.* ///
*రైతులందరికీ పంటల బీమా వర్తింప చేయాలి.* ///
*ఉచిత టార్పాలిన్ పటాలు రైతులందరికీ ఇవ్వాలి* ///
*ప్రతి గ్రామంలో రైతుల పంటలు ఆరబోసుకునుందుకు స్థలాన్ని కేటాయించాలి.* ///
*రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన నంద్యాల జిల్లా కలెక్టర్.* ///
*నంద్యాల కలెక్టరేట్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 23 –:*
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో మొక్కజొన్న సాగుచేసిన రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, సీఐ జోక్యంతో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ. రాజశేఖర్, జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ... నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష 57 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు, ఒక్కొక్క ఎకరాకు పెట్టుబడిగా 30 వేల రూపాయలు, కౌలు 15 వేల నుండి 20 వేల రూపాయలకు చెల్లించి పెట్టుబడి పెట్టడం జరిగిందనీ, ఒక్క ఎకరా 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వల్ల పంట పొలాల్లో .. కల్లా లలో తడిసిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అరకురా పండిన మొక్కజొన్నలను అమ్ముకుందామంటే మధ్య దళారులు కేవలం 160 నుండి 1700 రూపాయల వరకు అడుగుతున్నారని, తూకాల్లో 5 కేజీలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఓట్లేసి గెలిపించిన జిల్లా ప్రజా ప్రతినిధులు ... రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం రైతుల గురించి పట్టించుకోవడంలేదని, అందువల్లనే గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులందరూ పనులు వదిలిపెట్టి కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చారని, ఇప్పటికైనా పాలకులారా కాస్త కులాల బాట పట్టండి రైతుల ఇబ్బందులు తెలుసుకోండి. కేంద్రంలోని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు ధరలను అమలు జరపండి. అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు సకాలంలో ప్రభుత్వాలు అందించవు, యూరియా బస్తాలు అందించరూ, కనీసం మీరు ప్రకటించిన మద్దతు ధరలు అమలు జరుపరు ఎవరికోసం మీరు పరిపాలన సాగిస్తున్నారు అని జిల్లా జిల్లా ప్రజా ప్రతినిధులను దుయ్యబట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా పంట సాగు చేసి నష్టపోయిన రైతులందరికీ ఈ క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రతి రైతుకు ఎకరా కున్నల 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని, జిల్లాలోని ప్రతి మండలంలోనూ ప్రభుత్వమే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు ధరలకు రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, క్వింటా 2400 రూపాయలు ప్రకారం కొనుగోలు చేయాలని, పంటల బీమా పథకం అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన పంట నష్టం పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా కొంపమని, పూర్తిస్థాయి విచారణ నిమిత్తం జిల్లాలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి నివేదిక తీస్తున్నామని, వీటి ఆధారంగా నష్టపరిహారం కోసం కృషి చేస్తామని అలాగే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందని, బహుశా రెండు మూడు రోజుల్లో వీటి పైన స్పష్టమైన నిర్ణయం వస్తుందని తద్వారా రైతులకు అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని కలెక్టర్ తెలియజేశారు. కలెక్టర్ హామీతో తాతకాలికంగా ఆందోళన నిర్మించుకుంటున్నామని, వీలైనంత త్వరగా కలెక్టర్ తమ రైతుల అన్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.సుబ్బరాయులు, టి. వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఏ .సురేష్, పి .రామ్మోహన్ తోపాటు కోళ్లు రైతు సంఘం జిల్లా నాయకులు మార్క్, రైతు సంఘం నాయకులు గు రెడ్డి, నరేష్, రంగస్వామి, కేజే శ్రీనివాసరావు, సుందరేసన్, వివిధ గ్రామాల రైతులు మాధవరెడ్డి, భోగేశ్వర్ రెడ్డి, రమణ, హిమామ్ హుస్సేన్ వాళ్లతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other