*ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అండగా ఉంటున్నాం –: రాష్ట్ర మంత్రి టీజీ భరత్*
*ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అండగా ఉంటున్నాం –: రాష్ట్ర మంత్రి టీజీ భరత్* ///
*.సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్* ///
*కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 30 –:*
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరం లోని ఆయన కార్యాలయంలో 5 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. చెలిమిల అభినయ్ కుమార్ 80,833, రంగమ్మ కు 1,20,000, పద్మావతికి 12,300, జె. విలియం కుమార్ 30,541, అల్లూరి సరస్వతికి 1,22,220ల చెక్కులు అందించారు. ఆపద సమయంలో కర్నూలు నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి టీజీ భరత్ కృతజ్నతలు తెలిపారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నారని ఆయన అన్నారు. మాటిచ్చిన విధంగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇక చెక్కులు అందుకున్న వారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి టీజీ భరత్ ల మేలు మరిచిపోలేమని సంతోషం వ్యక్తం చేశారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other