*వీరబ్రహ్మేంద్ర స్వామివారిని ... శ్రీ జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మ వారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి ... సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కే పార్వతమ్మ ...
*వీరబ్రహ్మేంద్ర స్వామివారిని ... శ్రీ జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మ వారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి ... సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కే పార్వతమ్మ ... కడప జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ వడ్ల శ్రీనివాస్ ఆచారి* /// *కడప జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 31 –:* కడప జిల్లా కంది మల్లయపల్లి జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠమునందు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని ... శ్రీ జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి ... సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కే పార్వతమ్మ ... కడప జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ వడ్ల శ్రీనివాస్ ఆచారి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఇటీవల అధిక వర్షాలకు స్వామి వారు నివసించిన నివాసగృహం పడిపోయిన విషయము విధితమే ఆ నివాస గృహాన్ని అధికారులు స్వామివారి కుటుంబ సభ్యులు ... గ్రామ పెద్దలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి ... సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కే పార్వతమ్మ మాట్లాడుతూ ... స్వామి వారు నివసించిన గృహమును గతంలో ఉన్నట్లుగానే పునరుద్ధరణ చేయాలని ... భక్తుల మనోభావాలు అనుగుణంగా నిర్మించాలని స్వామి వారు వాడిన పరికరములను ఒక మ్యూజియం గా ఏర్పాటు చేసి అందులో ఉంచాలన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి మఠం జగన్మాత ఈశ్వరి మహాదేవి మఠం పరిసర ప్రాంతాలను గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె సత్యనారాయణ , శోభన్ బాబు , సుతారి రాఘవేంద్ర ఆచారి , కె రామాచారి విశ్వకర్మ , బంగారు విశ్వరూప ఆచారి , వీరభద్ర స్వామి , సంపత్ స్వామి , వీరంబుట్లయ్య స్వామి , దత్తాత్రేయ స్వామి , సుంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other