భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం–: సిపిఎం రంగారెడ్డి జిల్లా డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం* –:*సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు*
త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో గురువారం రోజు కేశంపేట్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో భూ నిర్వాసితులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందుకూరి జగన్ , డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మొత్తం 26 గ్రామాల గుండా ఆరు మండలాల్లో త్రిబుల్ ఆర్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గం లోని కేశంపేట్ మండలంలోని 9 రేకుల నిడద వెళ్లి గ్రామ త్రిబుల్ ఆర్ రోడ్డు అలాన్మెంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలైన్మెంట్ను ప్రకటిస్తూ అట్లాగే రూట్ మ్యాప్ ఇస్తూ సర్వే నెంబర్లతో సహా ఇవ్వటం వలన ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి రైతులు అనేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ అనేక రూపాలలో నిరసన వ్యక్తం చేయాలని ముఖ్యంగా ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మ్యాపు లో ఉన్నటువంటి భూముల పట్టాదారులు మొత్తం పేద రైతాంగం ఒక్కొక్కరికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి పేదలు మాత్రమే ఉన్నారు ఇట్టి పేద రైతులు అట్టి భూములపై వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్టే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఒకచోట ఒకరకంగా ఇంకోచోట ఇంకోరకంగా ప్రకటిస్తూ ఇది కేవలం ఎక్కడ ప్రకటించిన అట్టి భూముల రైతులు పేద రైతులు ఉన్నారు ఇది కేవలం పెట్టుబడుదారుల ప్రయోజనం కోసమే ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను చేస్తున్నారని ఇది పేద రైతుల కోసం కాదని ఇది పేదరిక రైతుల కోసం కాదని అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నిత్యం వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నటువంటి మా పేద రైతుల పొట్ట కొట్టొద్దని రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన గురవుతున్నారు. దీని వలన పేద రైతులు మా భూములు పోవడం వల్ల మేము జీవించేది ఎట్లా బ్రతికేది ఎట్లా అని మనం ఏదైనా గురవి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పేద రైతులకు భూములు జోలికి రావద్దని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పేదల పొట్ట కొట్టొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 90% రైతులకు చిన్న సన్నకారు రైతులు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్లో తమ భూములను కోల్పోతున్నారన్నారు. కాబట్టి పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో రైతులను సమీకరించుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని రైతుల పక్షాన పోరాడి సాధించేవరకు ఈ పోరాటాన్ని వదిలే ప్రసక్తి లేదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీను నాయక్ మండల కన్వీనర్ బేరి శ్రీనివాస్ రైతు సంఘం నాయకుడు కానుగుల వెంకటయ్య గ్రామ రైతులు పోగుల భీమయ్య కృష్ణారెడ్డి బాలరాజు గౌడ్ కృష్ణయ్య గౌడ్ గోవర్ధన్ గౌడ్ రంగయ్య జంగయ్య శ్రీనివాస్ రెడ్డి చెన్నారెడ్డి బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి బాలయ్య రాములు యాదగిరిరెడ్డి సత్యనారాయణ శ్రీనివాసులు రామ్ రెడ్డి మల్లయ్య సాయిలు దామోదర్ జంగయ్య చంద్రయ్య సత్యం మహేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other