హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన .. కర్నూలు జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: ప్రభుత్వ బి.సి., ఎస్. సి, ఆనంద నిలయం హాస్టల్స్ , కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి* ///
కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ... జిల్లా జడ్జి జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు గల ప్రభుత్వ బి.సి , ఎస్. సి, ఆనంద నిలయం హాస్టల్స్ ను ఆకస్మికంగా సందర్శించి ఆ హాస్ట ల్స్ లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. పిల్లల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. అధిక వర్షాల కారణంగా హాస్టల్ లో పిల్లలు తాగే డ్రింకింగ్ వాటర్ పరిశుభ్రంగా ఉండాలని అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా మెడికల్ కిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సాయంత్రం పూట వారికి అందించే స్నాక్స్ ను విద్యార్థులతో కలిసి జడ్జి తిని .. విద్యార్థులతో ఇంటర్ యాక్ట్ కావడం జరిగింది . జిల్లా న్యాయ సేవ కర్నూలు వారి ఆధ్వర్యంలో పిల్లల మనోవికాసం కొరకు మూడు హాస్టళ్లకు సప్లై చేసిన మూడు టీవీలను సరైన రీతిలో విద్యార్థులు ఉపయోగిస్తున్నారా లేదా అనీ పరిశీలించారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివెళతామని తెలియజేశారు. అనంతరం విధ్యార్థులకు ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్ -15100 ఉపయోగించుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, బి సి, యస్ సి, ఆనంద నిలయం హాస్టల్స్ వార్డెన్స్ సులోచన, శైలజ,రజని పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other