*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: కోడి కత్తులను తయారు చేయటానికి అనుమతులు ఇప్పించండి*
*కోడి కత్తులను తయారు చేయటానికి అనుమతులు ఇప్పించండి*. *విజయవాడ అక్టోబర్ 23 –:* గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు పంచ వృత్తులకు సంబంధించిన విశ్వకర్మియులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ ... అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి పంచ వృత్తులలో ఒకటైన కమ్మరి వృత్తి చేసుకొను వారి సమస్యలను ఛైర్పర్సన్ కి విన్నవించడం జరిగింది.
విశ్వబ్రాహ్మణ జాతిలో ఉన్న ఐదు వృత్తులలో ముఖ్యమైన కమ్మరి వృత్తి చేసుకుంటూ తమ పూర్వీకుల నుండి జీవనం సాగిస్తున్నాము. ప్రధానముగా తమ కులవృత్తి ఇనుముతో నాగళ్లు రైతులకు ఉపయోగపడేటటువంటి కొడవళు, గడ్డపారలు, గొడ్డళ్ళు, కత్తులు, గృహిణులు ఉపయోగించే కత్తిపీటలు, చాకులు తయారు చేయడం తమ ప్రధాన వృత్తి. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్, దక్షిణాధి రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అతి ముఖ్యమైనటువంటి సాంప్రదాయ కోడి పందాలు అవి కూడ ఒక ఆట విడుపుగా అహ్లాదంగా ఏర్పాటు చేసుకునే కోడి పందాల్లో మాత్రమే వాడుకునే ఒక అంగుళంన్నర కోడి కత్తులు తయారు చేయడం కూడా మా వృత్తిలోని భాగమే కాని ఇటివల కాలంలో పోలీసులు మాపై దాడి చేసి మా వృత్తిలో ప్రధాన కారణమైన కోడి కత్తులను తయారు చేయవద్దని తమ పై దాడి చేసి మేము తయారు చేయు యంత్రాలను, సామాన్లు అకారణంగా పోలీసు స్టేషన్కు తీసుకెళుతున్నారు.
ఆ వస్తువులను రికవరీ చేసుకొను సమయంలో తమ పై దుర్బషలాడుతూ కొన్ని సమయాలలో చట్టవ్యతిరేకంగా తమ పై చేయి చేసుకోవడం కూడా జరుగుతుంది. మమ్ములను ఆర్ధికంగా నష్టపెట్టడమే కాకుండా రోజులు .. సంవత్సరాల తరబడి పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు.
కావున తమ యందు దయఉంచి కొన్ని వందల సంవత్సరాల నుండి కులవృత్తినే చేతి వృత్తులుగా మలుసుకుని జీవనం సాగిస్తున్న మమ్ములను , మా వృత్తిని కొనసాగించుటకు ప్రభుత్వం నుండి రక్షణ ... లైసెన్స్ లు ఇప్పించాలని , అలాగే పోలీసు వారి దాడుల వలన మా వృత్తిని కొనసాగించని యెడల మాకు కమ్మరి పని తప్ప వేరే పని రాదు. కావున ప్రభుత్వం నుండి రూ. 10 వేలు నెలకు పెన్షన్ ఇప్పించాలని ప్రభుత్వం నుండి ఇతర వ్యాపారాలు చేసుకొనుటకు హామీ లేని విధంగా బ్యాంక్ నుండి రూ.10 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించాలని వారు కోరటం జరిగింది. ఈ విషయంపై చైర్మన్ మాట్లాడుతూ ... పోలీస్ వారి నుండి ఎదుర్కొనే సమస్యల గురించి హోంమంత్రి దృష్టికి ... ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ ... అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ ధనాలకోట శోభన్ బాబు , గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ , వివిధ జిల్లాల నుండి ఈ సమావేశానికి విచ్చేసిన కమ్మరి ... గ్రైండింగ్ వర్క్ చేయు సభ్యులు పాల్గొనడం జరిగింది.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other