*నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్*

0
713

*నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* ///

 

*నంద్యాల మున్సిపల్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 23 –:*

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ .. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు.

 

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు అవుతోందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, నాణ్యతలో లోపాలు ఉన్నా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఫరూక్ స్వయంగా విద్యార్థినీ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, రుచిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో నంద్యాల డీఈవో జనార్ధన్ రెడ్డి , మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉర్దూ డిఐ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Other
When Should You Call a Professional for Roadside Tire Assistance?
A flat tire rarely happens at a convenient time. It can occur during a morning commute, a family...
By Seo Web 2026-06-16 20:01:48 0 477
Other
Get More Qualified Leads with Google Ads for Tour Operators
The travel and tourism industry has become increasingly competitive in recent years. Travelers...
By Emma Jonesn 2026-06-18 09:58:22 0 229
Art
Convert Logo to Embroidery for Babylock for Commercial and Home Use
Introduction There's something special about seeing your own design come to life in thread....
By Digitizing Buddy 2026-02-19 09:52:18 0 439
News
*మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం* /// *మాగంటి అక్షర,దిశిరల ఎన్నికల ప్రచారం* /// *ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*
*మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం* ///     *మాగంటి అక్షర,దిశిరల...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-25 18:03:28 0 538
Other
How a Shopify Virtual Assistant Saves Time
Running a successful Shopify store can be incredibly rewarding, but it also comes with a long...
By Steven Johnson 2026-06-18 11:14:27 0 294