*నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్*

0
715

*నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* ///

 

*నంద్యాల మున్సిపల్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 23 –:*

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ .. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు.

 

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు అవుతోందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, నాణ్యతలో లోపాలు ఉన్నా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఫరూక్ స్వయంగా విద్యార్థినీ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, రుచిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో నంద్యాల డీఈవో జనార్ధన్ రెడ్డి , మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉర్దూ డిఐ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Other
Why Brands Choose Custom Bags and Small Batch Production
Building a successful product brand has become much harder than it was a decade ago. Customers...
By Kevin Trops 2026-06-17 11:05:31 0 625
Shopping
Everything You Need to Know About Rolex Super Clone Watches
Luxury watches have long been symbols of status, craftsmanship, and timeless design. Among the...
By Oncloud Shoes 2026-06-18 11:00:00 0 350
News
What Is the Ultimate Guide to Customer Upload Files for WooCommerce?
In the moving world of online shopping in 2026 the old way of buying things is changing. People...
By Franklin Clinton 2026-02-06 14:55:44 0 578
Travel
Best Limo Service Boston | Luxury Limousine & Car Service 2026
Why Does Using the Best Limo Service Matter? Boston is not your average city. Whether...
By rosi dene 2026-04-06 10:42:36 0 788