*రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.*–:*కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.*
*రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.*–:*కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.* ///
*గత (2025 జనవరి నుండి అక్టోబర్ 24 వరకు) నెలలో 7,248 డ్రంకెన్ డ్రైవ్ కేసులు , 14,182 ఓపెన్ డ్రింకింగ్ కేసులు.* ///
*కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 25 –:*
ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ లు ఆదేశాలు జారీ చేశారు.
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సంధర్బంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
గత ( 2025 జనవరి నుండి అక్టోబర్ 24 వరకు ) నెలలో
7,248 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ,
14,182 ఓపెన్ డ్రింకింగ్ కేసులు
నమోదు చేశారని, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ , ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేశారన్నారు.
2025 సెప్టెంబర్ 29 వ తేది నుండి అక్టోబర్ 24 వరకు 85 స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాలను నిర్వహించారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other