*దుర్గామాత ఉత్స‌వాలు వైభ‌వంగా జ‌రుపుకోవాలి –: రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్* ///

*..టిజివి సంస్థ‌ల త‌రుపున ఉచితంగా 45 దుర్గామాత విగ్ర‌హాలు పంపిణీ*///

*కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) సెప్టెంబర్ 21 –:*
టిజివి సంస్థ‌ల త‌రుపున క‌ర్నూలు న‌గ‌రంలో 45 దుర్గామాత విగ్ర‌హాల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. విగ్ర‌హాల‌కు సంబంధించిన టోకెన్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో విగ్ర‌హాల మండ‌పాల నిర్వాహ‌కుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ప్ర‌తి సంవ‌త్స‌రం దుర్గామాత విగ్ర‌హాల‌ను క‌ర్నూల్లో ఉచితంగా అంద‌జేస్తామ‌ని.. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉచితంగా ఇస్తున్న‌ట్లు చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.7 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపారు. టిజివి సంస్థ‌ల త‌రుపున క‌ర్నూల్లో త‌మ సేవా కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టికీ ఇలాగే కొన‌సాగుతాయ‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. దుర్గామాత ఉత్స‌వాలను ప్ర‌జ‌లంద‌రూ వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని ఆయ‌న కోరారు.
*దుర్గామాత ఉత్స‌వాలు వైభ‌వంగా జ‌రుపుకోవాలి –: రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్* /// *..టిజివి సంస్థ‌ల త‌రుపున ఉచితంగా 45 దుర్గామాత విగ్ర‌హాలు పంపిణీ*/// *కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) సెప్టెంబర్ 21 –:* టిజివి సంస్థ‌ల త‌రుపున క‌ర్నూలు న‌గ‌రంలో 45 దుర్గామాత విగ్ర‌హాల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. విగ్ర‌హాల‌కు సంబంధించిన టోకెన్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో విగ్ర‌హాల మండ‌పాల నిర్వాహ‌కుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ప్ర‌తి సంవ‌త్స‌రం దుర్గామాత విగ్ర‌హాల‌ను క‌ర్నూల్లో ఉచితంగా అంద‌జేస్తామ‌ని.. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉచితంగా ఇస్తున్న‌ట్లు చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.7 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపారు. టిజివి సంస్థ‌ల త‌రుపున క‌ర్నూల్లో త‌మ సేవా కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టికీ ఇలాగే కొన‌సాగుతాయ‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. దుర్గామాత ఉత్స‌వాలను ప్ర‌జ‌లంద‌రూ వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని ఆయ‌న కోరారు.
0 Comments 0 Shares 243 Views 0 Reviews
Sponsored