*సిపిఎం, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.* ///
*అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలి. –: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి.* ///
*కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 16 –:*
ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. నిర్మల, సిపిఎం కర్నూల్ నగర కార్యదర్శి రాజశేఖర్, జిల్లా నాయకులు విజయ్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకులు అలివేలమ్మ, శ్యామలమ్మ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులను అక్రమంగా గృహ నిర్బంధం చేయటం కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఎమ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే లాగా, ప్రజలు, ప్రజాసంఘాల నాయకుల స్వేచ్ఛను హరించేలాగా పోలీసుల వైఖరి ఉన్నది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేందుకు భారత పౌరులకు రాజ్యాంగమే హక్కు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ కర్నూల్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
పోలీసులు యొక్క అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

అరెస్టు చేసిన సిపిఎం, సిపిఐ, ఐద్వా, డివైఫ్ఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, గృహ నిర్బంధం చేసిన సిపిఎం నాయకుల దగ్గర నుండి పోలీసులు వెనక్కి వెళ్లాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
*సిపిఎం, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.* /// *అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలి. –: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి.* /// *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 16 –:* ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. నిర్మల, సిపిఎం కర్నూల్ నగర కార్యదర్శి రాజశేఖర్, జిల్లా నాయకులు విజయ్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకులు అలివేలమ్మ, శ్యామలమ్మ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులను అక్రమంగా గృహ నిర్బంధం చేయటం కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఎమ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే లాగా, ప్రజలు, ప్రజాసంఘాల నాయకుల స్వేచ్ఛను హరించేలాగా పోలీసుల వైఖరి ఉన్నది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేందుకు భారత పౌరులకు రాజ్యాంగమే హక్కు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ కర్నూల్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పోలీసులు యొక్క అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అరెస్టు చేసిన సిపిఎం, సిపిఐ, ఐద్వా, డివైఫ్ఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, గృహ నిర్బంధం చేసిన సిపిఎం నాయకుల దగ్గర నుండి పోలీసులు వెనక్కి వెళ్లాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
0 Comments 0 Shares 434 Views 0 Reviews
Sponsored