ముందు చూపులేని ఇంజనీర్లు .. ప్రజల ఆరోగ్యం పట్టని , ప్రజా ఆరోగ్యశాఖ

0
242

*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 :– ముందు చూపులేని ఇంజనీర్లు.. ప్రజల ఆరోగ్యం పట్టని ప్రజా ఆరోగ్య శాఖ.!*

 

 *అశాస్త్రీయంగా కాల్వల నిర్మాణం .... పేరుకుపోయిన చెత్త: భరించలేని దుర్వాసన*

 

 కర్నూలు నగరంలోని కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో కాలువల్లో రోడ్ల పైన నిలిచిపోయిన మురికి నీరు రోడ్ల పక్కన పేరు కనుపోయిన చెత్త కుప్పల వల్ల దుర్వాసనతో ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి దాపురించిందని మాజీ వార్డ్ సభ్యులు టి వెంకటస్వామి, స్థానిక కాలనీ ప్రతినిధులు ఈ లక్ష్మణ గౌడు, పి శ్రీనివాసులు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రైల్వే స్టేషన్ సమీపం లో రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా ముందుచూపు లేకుండా అశాస్త్రీయంగా మురికి కాలువలు నిర్మించడం వల్ల మురికి నీరు నిలవడం తో పంపుతో రోజు తొలగించే పరిస్థితి వచ్చింద అన్నారు. తారక రామా నగర్ బిర్లా కాంపౌండ్ సమీపంలో కొండల్లాగా చెత్త కుప్పలు పేర్కొని పోయి ప్రజలు దుర్వాసనతో అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య సమస్యపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు చెప్పారని అన్నారు. నగరానికి వెళ్లేందుకు దగ్గర దారి కనుక స్థానికులతో పాటు శివారు కాలనీల వాళ్లు ఈ రోడ్డు మీదుగా వెళ్తారని అన్నారు. దుర్వాసన భరించలేక అందరూ ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ప్రజారోగ్య శాఖ ప్రధాన అధికారికి పట్టదా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు . ఈ పర్యటనలో మహమ్మద్ యూనూస్, సి వి వర్మ, కే మధుసూదన్,బి చిన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
News
*మెప్పించిన కళా ప్రదర్శనలు.. ఆకట్టుకున్న గుజరాత్ హస్తకళా ఉత్పత్తులు*
*మెప్పించిన కళా ప్రదర్శనలు.. ఆకట్టుకున్న గుజరాత్ హస్తకళా ఉత్పత్తులు* /// *మాదాపూర్ ప్రతినిధి...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-31 16:31:44 0 82
News
*కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై చాయ్ సెంటర్ వద్ద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి చర్చ*
*కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై చాయ్ సెంటర్ వద్ద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-31 16:04:26 0 83
News
*మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ... నంద్యాల లో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం.*
*మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ... నంద్యాల లో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం.*...
By Shalanna Shalanna 2025-10-23 17:10:23 0 254
Food & Recipes
Baked Root Vegetable Crisps
This recipe uses a variety of root vegetables, which offer different colors and flavors....
By Seshta Fusion Foods & Beverages 2025-11-05 17:59:06 0 44
Other
In Indian Kashmir, a flash flood claims scores of lives and leaves at least 200 people missing.
It is the second such disaster to hit the Himalayas in less than a week after an unexpected...
By Aryavarta Media Network 2025-08-14 20:45:37 0 1K