*త్వరలో నంద్యాల ఉర్దూ భవన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ విద్యార్థుల కు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా* –:*మైనారిటీ సంక్షేమ ... న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్*

0
311

*సబ్జెక్టు పరమైన విధ్య తొ పాటు ప్రస్తుత టెక్నాలజీ కాలం లో కంప్యూటర్ విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు విద్యార్థులు కృషి చేయాలి* /// 

 

*త్వరలో నంద్యాల ఉర్దూ భవన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ విద్యార్థుల కు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా* –:*మైనారిటీ సంక్షేమ ... న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్*

 

*నంద్యాల జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 23 –:*

 

నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హై స్కూల్ నందు పదవ తరగతి ఉర్దూ మాధ్యమం ప్రాక్టీస్ మెటీరియల్ ను సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఈడిఎమ్) తరుపున ఆవిష్కరణ, పంపిణీ కార్యక్రమం నిర్వహించారు...

 

సిఈడిఎమ్ డైరెక్టర్ కే. యాఖూబ్ బాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మైనారిటీ సంక్షేమ ... న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని సిఈడిఎమ్ ఆధ్వర్యంలో ప్రచురితమైన పదవ తరగతి ఉర్దూ మాధ్యమం ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ ను ఆవిష్కరించారు. తదనంతరం సిఈడిఎమ్ అసోసియేట్ మునీర్ అహ్మద్ తన ప్రసంగం లో మైనారిటీ విద్యార్థుల విద్యా పరం, గ్రూప్, డి. ఎస్. సి, టేట్ పోలీస్, తదితర ఉద్యోగాలు సాధించటకు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు అన్నారు..

 

ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ ... న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో విద్యార్థులకు సబ్జెక్టు వారి బోధన తొ పాటు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అన్నారు.. త్వరలో స్థానిక ఉర్దూ భవన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ తరుపున కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి మంచి ఫ్యాక్టల్టీ తొ ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభం చేస్తామన్నారు.. స్కూల్, కాలేజీ విద్యార్థులు సాయంత్రానికి తమ కు అనుకూలంగా ఉన్న టైమ్ లో కంప్యూటర్ శిక్షణ తరగతుల కు హాజరు కావచ్చు అన్నారు.. రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన ముగ్గురు పదవ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు 11 నవంబర్ జాతీయ విద్య దినోత్సవం నాడు ఉర్దూ అకాడమీ ద్వారా పది వేలు, మెడల్, ప్రశంస పత్రాలు అందచేయటం కొరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. క్రమ శిక్షణ తొ రెగ్యులర్ గా పాఠశాల కు వచ్చి ఉన్నత విద్య అభ్యసించి తమ భవిష్యత్తు ను ఉజ్వలమైన భవిష్యత్తు గా మలుచుకొవాలన్నారు...

 

జిల్లా విద్యా శాఖ అధికారీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ... రాష్ట్ర మైనార్టీలకు మంచి మనసున్న నాయకులు ఫరూక్ ఉండడం అదృష్టం అన్నారు.. క్రమశిక్షణతో చదువు కొనసాగించాలని విద్యార్థుల ను కోరారు...

 

సిఈడిఎమ్ డైరెక్టర్ యాఖూబ్ బాష మాట్లాడుతూ గత సంవత్సరం వరకు రెండు నెలలు పరీక్షలు ఉన్నాయి అనగా ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ చేసేవారు... కానీ ఈ విద్యా సంవత్సరం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ప్రత్యేక చేరువతొ ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ ను పబ్లిక్ పరీక్షల 6 నెలల ముందు పంపిన చేయడం మంచి శుభ పరిణామం అన్నారు.. నవంబర్ 5 వ తేదీ లోపల రాష్ట్రం లోని ప్రతి ఉర్దూ ఉన్నత పాఠశాల వరకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేయుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు... 

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ తరుపున రాష్ట్ర కన్వీనర్ సి. అబ్దుల్ అజీజ్, నంద్యాల జిల్లా అధ్యక్షరాలు షమీమ్ బాను, నంద్యాల లో సిఈడిఎమ్ రీజనల్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండూ, మూడు ర్యాంకులు సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఉర్దూ అకాడమీ ద్వారా 5 వేల బదులు పది వేలు, మెడల్ ప్రశంస పత్రం అందచేయీలని మంత్రి కి వినతి పత్రం అందజేశారు...

 

తదనంతరం నంద్యాల మండలం, మహానంది మండలంలోని పదవ తరగతి ఉర్దూ విద్యార్థులకు సిఈడిఎమ్ ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ చేశారు.. 

 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ రేంజ్ అస్ముద్దీన్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లాహ, తెలుగుదేశం పార్టీ ప్రముఖ మైనారిటీ నాయకులు చాబోలు ఇలాయస్, ఉర్దూ ఉపాధ్యాయలు, పెద్ద సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
News
*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ స్థాయి అవార్డు.*
*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ...
By Shalanna Shalanna 2025-10-30 10:46:09 0 105
Health
Homeopathic Medicines for Neuropathy
Homeopathy offers several remedies for **neuropathy** (nerve pain, tingling, burning, or...
By Seshta Integrated Medicine Research Centre 2025-04-20 06:20:44 0 3K
News
*పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి –: మంత్రి టీజీ భరత్*
*పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి –: మంత్రి టీజీ భరత్* ///    *కర్నూలు...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-31 16:18:33 0 82
Education
Master of Science - Economics
     Those who wish to expand their knowledge of economic theories, quantitative...
By IIBMS ANDHRAPRADESH 2025-09-15 06:00:46 0 706
News
Azharuddin Begins New Innings: Sworn in as Telangana Minister Amid BJP Allegations of "Poll 
HYDERABAD — Former Indian cricket captain and prominent Congress leader Mohammad...
By Aryavarta Media Network 2025-10-31 17:42:42 0 50