*పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి –: మంత్రి టీజీ భరత్*

0
657

*పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి –: మంత్రి టీజీ భరత్* /// 

 

*కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 31 –:*

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 15వ వార్డు పరిధిలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ పార్కులో 15వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పామన్న ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కార్పొరేటర్ శివమ్మ, వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పామన్న, పార్టీ నాయకులు అబ్బాస్, జేమ్స్, రవికుమార్, బూత్ ఇంచార్జిలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని 15వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పామన్న పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ దసరా పర్వదినం సందర్భంగా తాను విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కార్మికులు చేస్తున్న కృషిని అభినందించారు. అలాంటి వారి సేవలను గుర్తించి వారికి ఇలాంటి ప్రోత్సాహకాలను అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కర్నూల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని వెల్లడించారు. నగరంలోని అన్ని వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ పార్టీ కార్పొరేటర్లతో పాటు నాయకులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Education
Advance Diploma In Biotechnology Management
Those interested in the business and management facets of biotechnology can enroll in the...
By IIBMS Aandhra Pradesh 2025-08-31 12:54:10 0 1K
Other
Flexible Staff Augmentation Models for Technology Teams
In today's rapidly evolving technology landscape, organizations face constant pressure to deliver...
By Ellen Green 2026-02-11 07:27:01 0 643
Health
Lorazepam in the UK: Understanding Its Uses, Safety Considerations, and Online Healthcare Access
  Lorazepam is a prescription medication commonly used to treat anxiety-related conditions,...
By Oliviya Jack 2026-06-18 07:17:49 0 306
Health
Cheek Fillers Treatment in Dubai Complete Guide
Cheek enhancement has become one of the most requested facial aesthetic procedures today. This...
By Skincare Clinic 2026-02-16 10:19:40 0 520
Sponsored